- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజుకు 2 వేలకు పైగా మరణాలు..! లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు
న్యూఢిల్లీ : దేశాన్ని ఇప్పుడప్పుడే వదిలే పరిస్థితుల్లో లేని కరోనా వేలాది మందిని పొట్టనబెట్టుకుంటున్నది. భారత్‌లో నెల రోజుల క్రితం రోజుకు 500 కూడా దాటని మరణాలు ఇప్పుడు వేయికి పైగా నమోదవుతున్నాయి. అయితే ఇవి జూన్ తొలి వారం నాటికి 2,320 కి పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ ఒక నివేదికలో వెల్లడించింది. ‘భారత్‌లో కొవిడ్-19 రెండో దశ నిర్వహణ : తక్షణం తీసుకోవాల్సిన చర్యలు’ పేరు మీద లాన్సెట్ ఒక నివేదికను వెలువరించింది. గడిచిన నెలన్నరగా దేశంలో సెకండ్ వేవ్ లో నమోదవుతున్న కేసులు, మరణాలను విశ్లేషించి ఈ డేటాను రూపొందించినట్టు లాన్సెట్ వెల్లడించింది.
లాన్సెట్ నివేదిక ప్రకారం.. మే నెలాఖరు నాటికి దేశంలో రోజువారీ కరోనా మరణాల సంఖ్య 1,750 గా ఉంటుందని, అది జూన్ ఫస్ట్ వీక్ నాటికి 2,320కి పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. తొలి దశలో కరోనా కేసులు 10 వేల నుంచి 80 వేలకు చేరడానికి 83 రోజులు తీసుకుంటే రెండో దశలో అది 40 రోజులే పట్టిందని విశ్లేషించింది. రెండో దశలో లక్షణాలు లేని (అసింప్టమెటిక్) కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. భారత్ వంటి దేశంలో అందరికీ టెస్టులను నిర్వహించడానికి 7.8 బిలియన్ డాలర్లు (సుమారు 52 వేల కోట్లు), వైద్య సదుపాయాలు కల్పించడానికి మరో ఏడు వేల కోట్లు అవసరం అవుతాయని, అది ప్రభుత్వం మీద అదనపు భారమేనని పేర్కొంది.
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గాను 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ అందించాలని లాన్సెట్ సూచించింది. అంతేగాక ప్రస్తుతం ఉన్న కోవాగ్జిన్, కొవిషీల్డ్ తో పాటు మరిన్ని వ్యాక్సిన్లను వినియోగంలోకి తేవాలని సూచించింది. లాక్‌డౌన్ ల వల్ల ఉపయోగమేమీ లేదని స్పష్టం చేసింది. కానీ ఎక్కువ మంది గుమిగూడే సభలు, సమావేశాల వంటివాటిని నిర్వహించకుండా కట్టడి చేయాలని లాన్సెట్ సూచించింది.