క్షణాల్లో కరోనా రిజల్ట్

by vinod kumar |
క్షణాల్లో కరోనా రిజల్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిస్తూ, విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కాగా ఈ వైరస్ బారి నుంచి బయట పడటానికి ఇప్పటికే అనేక దేశాలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ కనిపెట్టినట్టు ప్రకటించింది. కాగా వైరస్ సాంపుల్స్ తీసుకున్న తర్వాత పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ కావడానికి కనీసం ఒక్కరోజైనా వేచి ఉండాల్సి వస్తోంది. అయితే దీనిపై ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసిన భారత్, ఇకనుంచి ఆ కష్టం తొలగనుంది. దీనికోసం భారత్‌తో కలిసి ఇజ్రాయెల్ ఓ సరికొత్త కరోనా టెస్టింగ్ కిట్‌ను తయారు చేస్తోంది. ఈ కిట్ సాయంతో క్షణాల్లో కరోనా పరీక్ష నిర్వహించడమే కాకుండా రిజల్ట్‌ కూడా పొందవచ్చని చెబుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ సాయంతో ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా బాధితులను వెంటనే గుర్తించడంతో పాటు వారి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునేందకు అవకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ ప్రధానాధికారి డాని గోల్ద్ మాట్లాడుతూ, శబ్దం, శ్వాస, శరీర ఉష్ణోగ్రతలను గుర్తించడం ద్వారా ఈ పరికరం పనిచేస్తుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ పరికరాన్ని భారత్‌లోనే పరీక్షించనున్నారు. విజయవంతమైన తరువాత కిట్‌ల తయారీ కూడా భారత్‌లోనే జరగనుంది. అంతేకాకుండా భారత్-ఇజ్రాయెల్ రెండు దేశాలూ కలిసి ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేయనున్నాయి.

Advertisement

Next Story