డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శం!

by Harish |
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శం!
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భారత్ అద్భుతమైన విధానాలను అనుసరిస్తోందని మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. చైనా తర్వాత భారత్ మాత్రమే ప్రపంచం అనుసరించదగిన దేశమని ఆయన చెప్పారు. భారత్ నమూనాను అనుసరించి తమ దాతృత్వ సంస్థ ఇతర దేశాల్లో ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ డేటాబేస్, బ్యాంక్, స్మార్ట్‌ఫోన్ మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థలతో పాటు డిజిటల్ చెల్లింపుల కోసం భారత్ మెరుగైన ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రధానంగా కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఇలాంటి విధానాలు ఎంతో దోహదపడుతున్నాయని, దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలుంటాయని వివరించారు. సింగపూర్‌లో జరిగిన వర్చువల్ ఫిన్‌టెక్‌ సదస్సులో మాట్లాడిన ఆయన.. డిజిటల్ రంగంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed