భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బెంబేలు

by Shiva |   ( Updated:2021-02-14 02:12:07.0  )
భారత్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బెంబేలు
X

దిశ, స్పోర్ట్స్: చెన్నై చేపాక్ స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండవ రోజు 300/6 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా కేవలం మరో 29 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్ కాస్త ధాటిగా ఆడటంతో ఆ కొన్ని పరుగులైనా వచ్చాయి. రెండో రోజు వేసిన ఓకే ఓవర్‌లోనే మొయన్ అలీ అక్షర్ పటేల్ (5), ఇషాంత్ శర్మ (0) పెవీలియన్ చేరారు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న రిషబ్ పంత్ ధాటిగా ఆడాడు. రెండు సిక్సులతో చెలరేగిన పంత్ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక స్టోన్ వేసిన ఓవర్‌లో కుల్దీప్(0), సిరాజ్ (4) అవుటయ్యారు. పంత్ ఒక్కడే 77 బంతుల్లో 58 పరుగులు చేసిన నాటౌట్‌గా మిగిలాడు. భారత జట్టు కేవలం 29 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో 329 పరగులకు ఆలౌట్ అయ్యింది.

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ఇన్నింగ్ తొలి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రోరి బర్న్స్ (0) పెవీలియన్ చేరాడు. మరో ఓపెనర్ డామ్ సిబ్లే (16) అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసి ఫుల్ ఫామ్‌లో ఉన్న జో రూట్(6)ను తొలి టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. అక్షర్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి జో రూట్ అవుటయ్యాడు. ఇక లంచ్ విరామానికి ఇంకొక బంతి మిగిలి ఉండగా.. అశ్విన్ వేసిన ఆ బంతికి డాన్ లారెన్స్ (9) శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 39 పరగులు చేశారు. రెండో రోజు తొలి సెషన్‌లో మొత్తం 8 వికెట్లు పడటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed