- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమిపూజను వీక్షించిన మరో 15 దేశాలు
దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిరం భూమి పూజను కేవలం భారతీయులే కాకుండా, మరో 15దేశాల ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్లు తెలుస్తోంది. అందులో యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్, ఓమన్, కువైట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, శ్రీలంక పాటు మరిన్ని దేశాల ప్రజలు ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల్లో వీక్షించారు. ఈ దేశాల్లోనే మరికొందరు యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి చెందిన ప్రత్యక్ష ప్రసారాలను ఏఎన్‌ఐ ద్వారా ఇతర ఛానెల్స్‌కు డిస్టిబ్యూట్ చేశారు. ఏఎన్‌ఐ ద్వారా సుమారు 1200స్టేషన్లకు పంపిణీ చేయగా, ఏపీటీఎన్ (అసోసియేటెడ్ ప్రెస్ టెలివిజన్ న్యూస్) ద్వారా మరో 450 మీడియా సంస్థలకు పంపిణీ చేశారు. డీడీ న్యూస్ మాత్రం ప్రత్యేకంగా ఏసియా పసిఫిక్ దేశాలతో ఈ కార్యక్రమాన్ని పంచుకుంది. ఒక్క భారత్‌లోనే 200 మీడియా సంస్థలు ఈ కార్యక్రమాన్ని లైవ్ తీసుకున్నట్లు దూరదర్శన్ అధికారులు వెల్లడించారు.