భారత్ 242 ఆలౌట్

by Shyam |
భారత్ 242 ఆలౌట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ 242 పరుగులకు కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా(54), పుజారా(54), విహారీ(55) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టీ విరామానికి 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన భారత్.. ఆ తరువాత వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. జేమీసన్ ధాటికి పుజారా, పంత్, ఉమేశ్ యాదవ్, జడేజా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఇక కివీస్ బౌలర్లు జేమీసన్ 5, బౌల్ట్, సౌథీ చెరో రెండు వికెట్లు, వాగ్నర్ ఒక వికెట్ పడగొట్టాడు.

Advertisement

Next Story