- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో 'స్వతంత్ర భారత జాతీయ పతాకం' క్యాన్వాస్ చిత్రం
దిశ, సిద్దపేట: భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు ‘స్వతంత్ర భారత జాతీయ పతాకం’ క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రుస్తుం మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ “స్వాతంత్ర్య పర్వం, భారతజాతికి గర్వం, ఆనందలే సర్వం” ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దాస్య శృంఖలాలను ఛేదించి ఎందరో ప్రాణత్యాగధనుల పుణ్యఫలం మనం అనుభవించే స్వాతంత్ర్యం అన్నారు. స్వతంత్రం సిద్దించి భారత జాతికి పెనుమార్పులు సంభవించినాయన్నారు. ఐకమత్యం, సహజీవనం, అభివృద్ధి లక్ష్యాలవైపు పూర్తిస్థాయిలో అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ తెలిపారు.
ముఖ్యమంత్రి కెేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యాలు రైతుబంధు, రైతుబీమా, నీటిపారుదల ప్రాజెక్టులు శాంతిభద్రతలు ప్రజా సంక్షేమ పతకాలు, ఆసరా కళ్యాణలక్ష్మి దళితబంధు భారతావనికి ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి అని అన్నారు. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఐకమత్యం సహజీవనం ప్రతి పౌరునికి రక్షణ, లేనివారికి రేషన్ కార్డులు, నిరుద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలని అందరి జీవితాల్లో ఆనందాలు పంచాలని, కరోనావైరస్ ను అధిగమించాలని మాస్క్, భౌతిక దూరంతో అప్రమత్తంగా ఉండాలని ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకొని భారత జెండా పండుగను జరుపుకోవాలని ప్రఖ్యాత మానవతా చిత్రకారుడు రుస్తుం ఆకాంక్షించారు. ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, CSE అసిస్టెంట్ ప్రొఫెసర్ GRIET రుబీనారుస్తుం, ఆయేషాబేగం, మైనార్టీనేత ముస్తఫా, కెమెరామెన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.