- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మ్యాచ్‌ను అడ్డుకున్న వరుణుడు
by Shyam |

X
కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో లంచ్ అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆట నిలిచే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజ్‌లో వైస్ కెప్టెన్ అజింక్య రహానే(38), రిషభ్ పంత్(10) ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తడబాటుకు గురైంది. టాప్ ఆర్డర్ పేకమేడలా కూలింది. వరుస విరామాల్లో కివీస్ బౌలర్లు వికెట్లు తీస్తూ భారత్‌ను కోలుకోనివ్వలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(16), అగర్వాల్(34), పుజారా(11), కోహ్లీ(2), హనుమ విహరీ(7) ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక కివీస్ బౌలర్లలో జామీసన్ మూడు, టిమ్ సౌథీ, బౌల్ట్ చెరో వికెట్ పడగొట్టారు.
Next Story