- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పేదల ఇండ్లకు శ్రీకారం..
దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఇండ్లు లేని నిరుపేదలకు గత కొన్నేళ్లుగా ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గృహాలు నిర్మించి నిరుపేదలకు అందజేస్తున్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదల ఒక్కో ఇంటికి ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ 1 లక్ష 50 వేల ఖర్చుతో 60 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యే విధంగా కృషి చేస్తున్నారు. ఈ గృహ నిర్మాణాలలో భాగంగా నిరుపేద బుడగ జంగాల 5 ఇండ్లు పూర్తయిన తరుణంలో గురువారం గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉప్పల వెంకటేష్ హాజరై నిరుపేదలను నూతన ఇళ్లల్లోకి గృహప్రవేశం చేయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
సొంత ఇండ్లు లేక బాధపడుతున్న నిరుపేద కుటుంబాలు ఉప్పల వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్‌లా సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్,ఎంపీటీసీలు జోగు రమేష్, అంబాజీ, సోనీ లక్యా, రామస్వామి, సర్పంచులు లక్ష్మణ నాయక్, రఘుపతి, రాజు, మాజీ ఎంపీటీసీ జంగయ్య, సింగల్ విండో డైరెక్టర్‌లు శేఖర్ యాదవ్, యాదయ్య, మండల కో ఆప్షన్ మెంబర్ ఇమ్రాన్, స్థానిక సర్పంచ్ లలిత జ్యోతయ్య, వార్డు మెంబర్లు విటల్, సరూప, యశోద, నూకం కోటేశ్వర్, దశరథ, తుమ్మ రమేష్, శ్రీను, రవికుమార్, మాజీ సర్పంచ్లు మాజీ ఎంపిటిసి లు,యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Construction