ఉమ్మనీరు తాగి పసికందు మృతి

by Sumithra |   ( Updated:2021-06-11 12:11:45.0  )
ఉమ్మనీరు తాగి పసికందు మృతి
X

దిశ, నల్లగొండ: ఉమ్మనీరు తాగి ఓ పసికందు నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. హన్మకొండకు చెందిన మీనా కౌర్ నిండు గర్భిణి. నెలలు నిండినా రోనా నేపథ్యంలో కాన్పు చేయడానికి స్థానికంగా ఉన్న ఆస్పత్రులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఉన్న తమ బంధువుల వద్దకు వచ్చారు. ఈ నెల 10వ తేదీన మీనా కౌర్‌కు నొప్పులు రావడంతో మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా వారు డెలివరీ చేశారు. ఆమె మగశిశువుకు జన్మనిచ్చి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. మరుసటిరోజు11వ తేదీన శిశువు కూడా అనారోగ్యంగా ఉండటంతో మిర్యాలగూడలోనే ఓ చిన్నపిల్లల వైద్యశాలకు తీసుకువెళ్లగా, అక్కడి వైద్యులు పరిశీలించి నల్లగొండకు తీసుకుపోవాల్సిందిగా సూచించారు. వెంటనే ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పసికందుకు చికిత్స అందిస్తుండగానే మృతిచెందాడు. ఉమ్మనీరు తాగడంతోనే పసికందు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. శిశువు పుట్టిన మరుసటి రోజే మృతి చెందడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed