- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలానగర్‌లో డ్రగ్స్ పట్టివేత.. 25 ఏళ్ల యువకుడు అరెస్ట్
దిశ, కుత్బుల్లాపూర్: డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడిని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికారి విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జీవన్ కిరణ్ బృందం, బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ మాఫియాపై గతవారం రోజులుగా ప్రత్యేక దృష్టి సారించారు. బాలానగర్ ప్రాంతంలో అమెజాన్ కొరియర్ సంస్థలో పని చేస్తున్న యూసుఫ్ గూడకు చెందిన సాయిరత్న(25) మత్తుకు అలవాటుపడి గోవా నుండి డ్రగ్స్ టాబ్లెట్స్ దిగుమతి చేసుకుని సేవించడం ప్రారంభించినట్లు గుర్తించారు.
గోవాలో ఒక్కో డ్రగ్ టాబ్లెట్‌కు రూ.1500లు చెల్లించి, ఇక్కడకు తీసుకొచ్చి అతనికి తెలిసిన స్నేహితులకు రూ.3 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సోమవారం ఉదయం బోరబండ అల్లాపూర్‌లో తనిఖీలు నిర్వహించి రూ.36 వేల విలువైన ఎక్టసీ అనే 12 డ్రగ్స్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.