కరోనా కాటుకు ఆర్థిక మాంద్యం తప్పదు!

by Harish |   ( Updated:2020-03-28 07:53:18.0  )
కరోనా కాటుకు ఆర్థిక మాంద్యం తప్పదు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కోరలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఛీఫ్ క్రిస్టలినా జార్జియెవా అన్నారు. ఈసారి ప్రపంచం ఎదుర్కోబోయే సంక్షోభం 2009 నాటి కంటే దారుణంగా ఉంటుందని, వాటిని అధిగమించేందుకు సిద్ధపడాలని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యానికి బలికావడం ఖాయమని ఆమె వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్లలో ఆర్థికపరమైన అవసరాలకు సుమారు 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే, ఇవి కూడా సరిపోకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తం దేశాల్లో 80కి పైగా దేశాలకు అత్యవసరంగా ఆర్థిక సాయం కావాల్సి ఉందని, వీటిలో ఎక్కువ భాగం అల్పాదాయ దేశాలే అని ఆమె తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed