ఆరోగ్యానికి మంచిదని వేడి నీళ్లు అతిగా తాగుతున్నారా.. జాగ్రత్త ఈ సమస్యలు రావచ్చు

by Anukaran |   ( Updated:2021-12-11 05:46:16.0  )
ఆరోగ్యానికి మంచిదని వేడి నీళ్లు అతిగా తాగుతున్నారా.. జాగ్రత్త ఈ సమస్యలు రావచ్చు
X

దిశ, వెబ్‌‌డెస్క్ : ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. మొత్తం ప్రపంచాన్నే కరోనా వణికించింది. దీంతో మానవ జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా ముందుకన్న కరోనా తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా రాకుండా ఉండాలంటే వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది అని చెప్పడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వేడి నీళ్లు తాగుతూ ఉంటున్నారు. అయితే ఎక్కువగా వేడి నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు వేడి నీళ్లు ఎక్కువ తాగడం వలన కలిగే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.

వేడి నీళ్లు తాగడం మంచిది. కానీ అతిగా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. చాలామంది దాహం వేయకపోయినా వేడి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా ఎక్కువగా వేడి నీళ్లను, ఎక్కువ రోజులు విరామం లేకుండా తీసుకోవడం వలన నరాలు చిట్లి పోవచ్చు అని వైద్యులు అంటున్నారు. పదేపదే వేడి నీళ్లు తాగడం వల్ల తలనొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. అంతే కాకుండా ఎక్కువగా వేడి నీళ్లు తాగడం వలన బ్లడ్ వెస్సెల్స్ సెల్స్ పై ప్రెషర్ పడుతుంది. బ్లడ్ వాల్యూమ్ సమస్యలు వస్తుంటాయి. అంతే కాకుండా ఎక్కువగా వేడి నీళ్ళు తీసుకోవడం వలన కిడ్నిపై ప్రభావం పడుతోందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందు వలన సాధ్యమైనంత వరకు తగిన మోతాదులో వేడి వాటర్ తీసుకోవడానికే ప్రయత్నించాలని వైద్యనిపుణల సూచన. అంతే కాకుండా వేడి వాటర్ ఎక్కువ తీసుకోవడం వలన నిద్ర మీద కూడ ఎఫెక్ట్ పడుతుందంట, దీని వలన నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వేడి వాటర్ జోలికి అతిగా వెళ్లకపోవడమే మంచిది.

Advertisement

Next Story