ప్రసాద్ స్టూడియోస్‌పై ఇళయరాజా కేసు

by Shamantha N |   ( Updated:2020-08-01 03:43:55.0  )
ప్రసాద్ స్టూడియోస్‌పై ఇళయరాజా కేసు
X

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతానికి వీరాభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. 40 ఏళ్లుగా తనందిస్తున్న బాణీలకు మెస్మరైజ్ అవుతూనే ఉన్నారు. కానీ ఈ మధ్య ఇళయరాజా తన ప్రవర్తనతో హెడ్ లైన్స్‌లో నిలుస్తున్నారు. తన పాటలు రీమిక్స్ చేసిన నేటితరం సంగీత దర్శకులను విమర్శించిన ఇళయరాజా.. అసలు ఆ హక్కు ఎవరు ఇచ్చారని? ప్రశ్నించారు. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇతరుల పాటను దొంగిలించడం కాదని.. సొంతగా పాట కంపోజ్ చేసుకోవాలన్నారు. కాగా, ఇప్పుడు మరోసారి ప్రసాద్ స్టూడియోస్‌పై కేసు పెట్టి వార్తల్లో నిలిచాడు రాజా.

ఇళయరాజా.. 1976 నుంచి ప్రసాద్ స్టూడియోస్‌లోనే తన స్టూడియో నడిపిస్తున్నారు. అక్కడే తన మ్యూజిక్ సిట్టింగ్స్, కంపోజిషన్ జరుగుతుంటాయి. అయితే గతేడాది ప్రసాద్ స్టూడియోస్ రెనోవేషన్‌లో భాగంగా ఇళయరాజాను ప్లేస్ ఖాళీ చేయాలని కోరారు ఎల్.వి. ప్రసాద్ మనవడు, ప్రసాద్ స్టూడియోస్ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ సాయి ప్రసాద్. దీనిపై ఇళయరాజా కోర్టుకెళ్లగా.. ఇంకా కేసు నడుస్తూనే ఉంది. అంతేకాదు తను మరో స్టూడియో ఏర్పాటు చేసుకునే వరకు టైమ్ ఇవ్వాలని సాయి ప్రసాద్‌ను కోరారు ప్రముఖ దర్శకులు భారతీ రాజా లాంటి వారు. ఈ విషయమై చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఈ లోపే, ప్రసాద్ స్టూడియోస్ రెనోవేషన్‌లో భాగంగా తన స్టూడియోతో పాటు పర్సనల్ రూమ్ కూడా తెరిచి కోట్లలో విలువైన వస్తువులను పగలగొట్టారని చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు ఇళయరాజా. తన కంపోజిషన్ నోట్స్, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ పాడు చేశారని ఆరోపించాడు. ఈ విషయాన్ని కొందరు స్నేహితుల ద్వారా తెలుసుకున్నట్లు చెప్పిన ఆయన.. చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed