భారత్ నుంచి మరిన్ని బొమ్మల ఉత్పత్తులను విక్రయించనున్న ఐకియా!

by Harish |   ( Updated:2021-02-28 06:36:00.0  )
IKEA
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజ సంస్థ ఐకియా దేశీయంగా పిల్లల బొమ్మల ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచాలని భావిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం పిల్లల శ్రేణిలో భాగంగా 1,000కి పైగా ఉత్పత్తులను కలిగి ఉన్నట్టు, రానున్న సంవత్సరాల్లో పిల్లల శ్రేణి ఉత్పత్తుల అమ్మకాలను మొత్తం అమ్మకాల్లో 12 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐకియా ఇండియా కంట్రీ కమర్షియల్ మేనేజర్ కవితా రావు చెప్పారు. ప్రస్తుతం భారత్ నుంచి పత్తి ఆధారిత బొమ్మలను మాత్రమే తీసుకుంటోందని, త్వరాలో చెక్క బొమ్మలతో సహా మరికొన్ని విభాగాల్లోకి విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇండియా టాయ్ ఫెయిర్‌లో పాల్గొన్న ఐకియా బొమ్మల విభాగంలో కంపెనీల భాగస్వామ్య అవకాశాలను అనివేషిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఐకియా పిల్ల ఉత్పత్తుల అమ్మకాల్లో 1,000కి పైగా ఉత్పత్తులను కలిగి ఉంది. ప్రస్తుతం ఇది మొత్తం ఉత్పత్తుల్లో 6-8 శాతం. సమీప భవిష్యత్తులో 10-12 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని’ కవితా రావు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed