- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకుంటే ఊరుకోం’
దిశ, సిద్దిపేట: రాష్ట్రంలో విద్య, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, పెండింగులో ఉన్న స్కాలర్ షిప్, రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ నాయకుడు మంద పవన్ డిమాండ్ చేశారు. విద్యా రంగ సమస్యలు పరిష్కారం చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సిద్దిపేట ఎడ్ల గురువారెడ్డి భవన్ లో నిరసన దీక్షను ప్రారంభించి, ఆ దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎందుర్కుంటున్నారని, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విద్యారంగానికి నిధులు మంజూరు చేయాలన్నారు. ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్య పరిష్కరించకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ డిమాండ్ ల పరిష్కరానికై సెప్టెంబర్ 7వ చలో ప్రగతి భవన్ నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఏస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు కనుకుంట్ల శంకర్, జేరిపోతుల జనార్థన్, జిల్లా అధ్యక్షుడు మన్నే కుమార్, బోనగిరి శ్రావణ్, నాయకులు దరిపల్లి రమేష్, తప్పేట శివకుమార్, జీకురు కరుణాకర్ లు పాల్గొన్నారు.