- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పుల్వామాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దు జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పుల్వామా జిల్లాలోని గంగూ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. సీఆర్‌పీఆఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు ఐఈడీని పేల్చినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలు ఉగ్రవాదుల పనే అని అనుమానిస్తున్నారు. ఈ పేలుడులో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్రమత్తమైన జవానులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం సీఆర్‌పీఎఫ్ జవానులు గాలింపు చేస్తున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story