- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుడా.. 'ఇడియట్' హీరోయిన్ ఏంటి.. ఇలా అయిపోయింది?
దిశ, వెబ్డెస్క్: సినిమా.. ఓ మాయ. ఈ రంగుల ప్రపంచంలో ఫేమ్ ఉన్నంతవరకే వారిని గుర్తుపెట్టుకుంటారు. ఒక్కసారి ఫేడ్ అవుట్ అయిపోయిన వారిగురించి పట్టించుకోరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది. ఇక ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లు కొంతమంది ఇంకా కొనసాగిస్తుంటే.. మరికొందరు ఈ పరిశ్రమను వదిలేసి గృహిణీలుగా, వ్యాపారవేత్తలుగా మారిపోయారు. ఇక సినిమాలకు ముగింపు పలికాక వారి ముఖాలను గుర్తుపట్టడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఒకప్పుడు ఉన్న రూపం పూర్తిగా మారిపోయి కనిపిస్తుంటారు. తాజాగా అలా అప్పటికి, ఇప్పటికి పూర్తిగా మారిపోయి కనిపిస్తున్న హీరోయిన్లో రక్షిత ఒకరు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే.. అంటూ కుర్రకారును తన చూపులతోనే కట్టిపడేసి.. గిచ్చి గిచ్చి చంపుతోంది గ్రీకు సుందరి అని స్టార్ హీరోలతో అనిపించుకున్న హీరోయిన్ రక్షిత ప్రస్తుతం ఏం చేస్తోంది..? ఎలా ఉంది..? ఎక్కడ ఉంది..? అనేది తెలుసుకుందాం.
‘ఇడియట్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రక్షిత అసలు పేరు శ్వేత. కన్నడ నటి మమతా రావు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని చిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకొంది. పూరీ హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ తెలుగులో స్టార్ హీరోలు నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు లతో జతకట్టి మెప్పించింది. ఇక కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడే కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని ప్రేమించి 2007 లో వివాహం చేసుకొని గృహిణి గా సెటిలైపోయింది. ఆ తర్వాత నిర్మాతగా మరి రెండు సినిమాలు నిర్మించిన రక్షిత ప్రస్తుతం ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పూర్తిగా రక్షిత రూపు రేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఈమెను ఎవరైనా చూస్తే ‘ఇడియట్’ హీరోయిన్ ఈమెనేనా..? అని అడగక మానరు. ఎంతగానో లావైపోయిన ఆమెను చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు.
రక్షిత ఇలా అవ్వడానికి కారణం ఆమె థైరాయిడ్ బారిన పడడమే. పిల్లలు పుట్టాక ఆమె థైరాయిడ్ బారిన పడ్డారు. దీంతో ఆమె పూర్తిగా లావుగా మారారు. ఇక ఈ విషయంపై రక్షిత తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” పిల్లలను కన్నాక లావయ్యాను.. నేను తగ్గడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. థైరాయిడ్ కి మందులు వాడుతున్నాను. అయినా.. ఎప్పుడూ నాజూకుగా ఉండడానికి నేనేమి ఇప్పడు హీరోయిన్ ని కాదు ” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రక్షిత కన్నడ షోలకు జడ్జి గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ఈమె రాజకీయాలలోను ప్రతిభ చూపుతోంది. ప్రస్తుతం రక్షిత బీజేపీ లో కొనసాగుతోంది.