- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత జీడీపీ వృద్ధి రేటును తగ్గించిన ఇక్రా
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మంగళవారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 0.5 శాతం తగ్గించింది. దేశీయంగా పెరుగుతున్న కరోనా సెకెండ్ వేవ్ కారణంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా వృద్ధి అంచనాను తగ్గిస్తున్నట్టు ఇక్రా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను ఇదివరకు 10-11 శాతం నుంచి 10-10.5 శాతానికి సవరిస్తున్నట్టు ఇక్రా పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలలో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఇక్రా అభిప్రాయపడింది.
అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఇదివరకు అంచనా వేసిన 27.5 శాతం నుంచి 20-25 శాతానికి తగ్గిస్తున్నట్టు ఇక్రా స్పష్టం చేసింది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఆర్థికవ్యవస్థలో అనిశ్చితి ఏర్పడుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. వినియోగదారుల విశ్వాసం కూడా తగ్గిపోతోందని ఇక్రా తెలిపింది. ఈ పరిణామాలతో వాహనాల రిజిస్ట్రేషన్లు, విద్యుత్ డిమాండ్, జీఎస్టీ ఈ-వే బిల్లులు ఏప్రిల్‌లో మందగిస్తాయనే అంచనాలున్నాయని ఇక్రా వెల్లడించింది.