T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసిందోచ్..! కొత్త కలర్, కొత్త థీమ్.. లుక్ అదుర్స్ (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-05-07 14:20:41.0  )
T20 World Cup: టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసిందోచ్..! కొత్త కలర్, కొత్త థీమ్.. లుక్ అదుర్స్ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం క్రికెట్ లవర్స్ అంతా ఐపీఎల్ ఈవెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఐపీఎల్ తరువాతే అసలు యుద్ధం మొదలు కాబోతోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా హోస్ట్ చేస్తున్న టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కాబోతోంది. పొట్టి ఓవర్ల సమరానికి కనీసం నెల రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు 15 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించారు. అదేవిధంగా అన్ని జట్లతో పాటు బీసీసీఐ కూడా ఏప్రిల్ 30న తుది జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనబడనున్నారు. ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన సరికొత్త జెర్సీల ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ కలర్‌లో జెర్సీ లుక్ అదిరింది. అయితే, అచ్చం ఇలాంటి ప్యాట్రన్ కలిగిన జెర్సీని టీమిండియా ఆటగాళ్లు 2019 వరల్డ్ కప్ సమయంలో ధరించారు.

Click Here For Twitter Post

Next Story

Most Viewed