T-20 World Cup:సెమీస్‌లో టాస్ ఓడిన టీమిండియా.. సేమ్ టీమ్‌తో బరిలోకి ఇరు జట్లు

by Satheesh |   ( Updated:2024-06-27 15:39:40.0  )
T-20 World Cup:సెమీస్‌లో టాస్ ఓడిన టీమిండియా.. సేమ్ టీమ్‌తో బరిలోకి ఇరు జట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్ కప్‌లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. సెమీస్-2లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. వెస్టిండీస్‌లోని గయానా స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తాడో పేడో తేల్చేకునేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. సూపర్-8లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమ్‌తోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. సెమీస్‌లో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా అదే టీమ్‌తో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు రంగంలోకి దిగింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఇరుజట్లు సమ ఉజ్జీవులుగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఫైనల్‌లో సౌతాఫ్రికాతో టైటిల్ కోసం తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ 8 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం పడటంతో ఆలస్యమైంది.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w/c), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ

Advertisement

Next Story

Most Viewed