AFG Vs SA : ముగిసిన అఫ్గాన్ వీరోచిత పోరాటం.. టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు సౌతాఫ్రికా

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-27 03:26:07.0  )
AFG Vs SA : ముగిసిన అఫ్గాన్ వీరోచిత పోరాటం.. టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు సౌతాఫ్రికా
X

దిశ, వెబ్‌డెస్క్: లీగ్, సూపర్ -8 దశలో అఫ్గానిస్తాన్ చేసిన వీరోచిత పోరాటం సెమీస్‌లో ముగిసింది. తొలి సెమీస్‌లో అఫ్గాన్ జట్టు చేతులెత్తేసింది. దీంతో మ్యాచ్‌లో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సౌతాఫ్రికా టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్గాన్ నిర్దేశించిన 56 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో చేధించింది. డికాక్ (5) పరుగుల వద్ద ఔట్ కాగా.. కెప్టెన్ మార్క్‌రమ్ (23), హెండ్రిక్స్ (29) ధాటిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. కాగా, ఈ నెల 29న టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో సెమీస్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌లో ఈనెల 29న బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా తలపడనుంది. 32 ఏళ్లలో ప్రపంచకప్ ఫైనల్ చేరడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి కావడం విశేషం. 1992 నుంచి 2024 వరకు 8 సార్లు ప్రపంచకప్ సెమీస్ కు దక్షిణాఫ్రికా చేరింది. 1999 ప్రపంచకప్ సెమీస్ ను దక్షిణాఫ్రికా టైగా ముగించింది.

Advertisement

Next Story

Most Viewed