వరల్డ్ కప్ హీరోపై ఐసీసీ ట్వీట్!

by Shyam |
వరల్డ్ కప్ హీరోపై ఐసీసీ ట్వీట్!
X

కరోనాపై పోరాటంలో వైద్య విభాగంతో పాటు పోలీసు శాఖ కూడా ముందు వరుసలో ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పోలీసులు రోడ్లపై ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానా పోలీసు శాఖలో పని చేస్తున్న ఒక డీఎస్పీపై ఐసీసీ ప్రశంసల జల్లు కురిపించింది. ఐసీసీ పోలీసును పొగడటమేంటనే కదా మీ డౌట్..? అసలు విషయం ఏంటంటే.. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ గుర్తుందా..? పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చివరి ఓవర్లో మిస్బా ఉల్‌ హక్‌ను అవుట్ చేసిన ‘జోగిందర్ శర్మ’ భారత్‌కు విజయాన్నందించి హీరో అయిన సంగతి తెలిసిందే.

క్రికెట్‌ కెరీర్‌ను వదిలేసిన తర్వాత జోగిందర్.. హర్యానా పోలీసు శాఖలో చేరాడు. ప్రస్తుతం హిస్సార్‌లో డీఎస్పీగా పని చేస్తున్నాడు.

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్ విధించడంతో.. దానిని సక్రమంగా అమలు చేసేందుకు జోగిందర్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. దీంతో అతని డ్యూటీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అయ్యాయి. లేటెస్ట్‌గా ఐసీసీ అతడిని ‘అప్పుడూ హీరోనే.. ఇప్పుడూ హీరోనే’ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఒక పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మాజీ క్రికెటర్‌కు ఇలా అభినందనలు తెలిపింది.

Tags : T20 world cup 2007, Joginder sharma, Police Dept, Corona

Next Story

Most Viewed