- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో కోహ్లీ డౌన్
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కేవలం ఒకే టెస్టు ఆడటంతో కోహ్లీ రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. అదే సమయంలో లబుషేన్ కోహ్లీని దాటి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక కేన్ విలియమ్‌సన్ అగ్రస్థానంలో, స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంకతో జరిగిన టెస్టులో రాణించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఆరు స్థానాలు ఎగబాయి ఐదోస్థానానికి చేరుకున్నాడు. భారత ఆటగాళ్లలో పుజారా ఒకస్థానం మెరుగుపర్చుకుని 7వ స్థానానికి చేరగా రహానె రెండు స్థానాలు దిగజారి 9వ ప్లేస్‌కు పడిపోయాడు. గబ్బాలో అదరగొట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ 13వ ర్యాంకును అందుకున్నాడు. బౌలర్లలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 8, బుమ్రా 9వ ర్యాంకుకు చేరుకున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా మూడో స్థానానికి పడిపోగా.. అశ్విన్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు . ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.