సందిగ్ధంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్

by Shyam |
సందిగ్ధంలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్ 14న లార్డ్స్ మైదానంలో 2019-2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పలు ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది ఫైనల్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయమై ఐసీసీ స్పందించింది. కరోనా కారణంగా రీషెడ్యూల్ అయిన ద్వైపాక్షిక సిరీస్‌ల సంఖ్యను బట్టి వచ్చే ఏడాది ఫైనల్ తేదీని నిర్ణయిస్తామని ఐసీసీ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ జెఫ్ అల్లార్డైస్ సోమవారం స్పష్టం చేశారు. ఇప్పటికే ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ గందరగోళంగా మారడంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేశామని గుర్తు చేశారు. ఆ సమయంలో రద్దయిన టెస్టు ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించుకోవాలని ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు ఆయన సూచించారు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్ దేశాలు పలు టెస్టులను వాయిదా వేసుకున్నాయి. ప్రస్తుత టైట్ షెడ్యూల్‌లో ఆ సిరీస్‌లను తిరిగి ఆడటానికి సమయం కావాలి. కాబట్టి 2021లో జరగాల్సిన ఫైనల్‌ను వాయిదా వేయాలని పలు దేశాలు కోరుతున్నాయి. అయితే, వాయిదా వేయాలనేది తొందరపాటు చర్చ, ఆ నిర్ణయం తీసుకోవడానికి మరికొంత కాలం వేచి చూడాలని జెఫ్ ఆల్లర్డైస్ అన్నారు.

Advertisement

Next Story