ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొత్త పాలసీ

by Shyam |
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొత్త పాలసీ
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలంటే ఇకపై వయసు నిబంధన కచ్చితంగా పాటించాలని ఐసీసీ ప్రకటించింది. ఏ క్రికెటర్‌కి అయినా 15 ఏళ్లు నిండితేనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఐసీసీ అనుమతి ఇవ్వనుంది. 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న క్రికెటర్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడించాలంటే సదరు దేశం తప్పని సరిగా ఐసీసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ క్రికెటర్‌ను ఐసీసీ పరీక్షించి.. అతడికి సరైన ఫిట్‌నెస్, మానసికస్థైర్యం ఉన్నట్లు భావిస్తేనే ఐసీసీ అతడికి అనుమతించనున్నది. ఈ నిబంధన అన్ని ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌లు, అండర్ 19 క్రికెట్‌కు వర్తించనున్నది. మహిళ, పురుష క్రికెటర్లకు ఈ నిబంధన అమలు చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ రజా 14 ఏల్ల 227 రోజులకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. సచిన్ మాత్రం 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed