- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘స్మిత్ కన్నా కోహ్లీనే అందుకు అర్హుడు’

దిశ, స్పోర్ట్స్: ఆధునిక క్రికెట్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ‘పరుగుల యంత్రం’ అనే పేరుంది. ఎటువంటి పిచ్‌ల మీదైనా పరిస్థితులకు తగ్గట్లు ఆడటంలో కోహ్లీకి సాటెవరూ లేరు. ఓ వైపు బ్యాట్స్‌మన్‌గా రికార్డులు సృష్టిస్తూనే.. టీమ్ ఇండియాకు కెప్టెన్‌గానూ విజయవంతమయ్యాడు. కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం క్రికెట్ సిరీస్‌లన్నీ పూర్తిగా స్తంభించడంతో ప్రముఖ వెబ్‌సైట్ ‘ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో’ పలువురిని ఇంటర్వ్యూ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్‌ను.. ప్రస్తుతం ఉత్తమ బ్యాట్స్‌మన్, కెప్టెన్ ఎవరు అని ప్రశ్నించింది ? దీనికి ఇయాన్ సమాధానమిస్తూ.. ‘రికార్డుల పరంగానూ, ఆట పరంగానూ ప్రస్తుతం విరాట్ కోహ్లీని దాటేసే వాళ్లు ఎవరూ లేరని’ చెప్పారు. అతను బ్యాట్స్‌మన్, కెప్టెన్‌గా ఇప్పటికే నిరూపించుకున్నాడని తెలిపాడు. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కాస్త వెనుకబడే ఉన్నాడని, అతని కంటే కోహ్లీలో ఆత్మవిశ్వాసం ఎక్కువని ఛాపెల్ వెల్లడించాడు.
Tags : Steve Smith, Virat Kohli, Cricket, Ian Chappell, Batsman, Captain