- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదాయపు పన్ను రిటర్నుల ఈ-వెరిఫికేషన్ గడువు పొడిగింపు..
దిశ, వెబ్‌డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను ఈ-వెరిఫై చేసుకునేందుకు ఆదాయపు పన్ను విభాగం గడువును పొడిగించింది. దీన్ని 2022, ఫిబ్రవరి 28 వరకు అవకాశం ఇస్తున్నట్టు ఐటీ విభాగం తెలిపింది. నిబంధనల ప్రకారం డిజిటల్ సంతకం లేకుండా ఎలక్ట్రానిక్ పద్దతిలో ఐటీఆర్ దాఖలు చేసినవారికి 120 రోజుల్లోపు ఈ-వెరిఫై చేయాలి. ఆధార్ ఓటీపీ, డీమాట్ అకౌంట్ లేదంటే నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఒకదానికి వచ్చే కోడ్‌ను ఉపయోగించి ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. లేదా బెంగళూరు ఐటీ కార్యాలయానికి సెంట్రలైజ్‌డ్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ)కి ఫైలింగ్ చేసిన ఐటీఆర్ డాక్యుమెంట్లను పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం ఐటీ విభాగం మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే రిటర్న్ దాఖలు చేయనట్లుగా పరిగణించనున్నట్టు ఐటీ విభాగం వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటికే వివిధ కారణాల వల్ల తిరస్కరించబడిన ఐటీఆర్‌లను ఈ-వెరిఫికేషన్‌కు అనుమతి ఉండదని, ఈ గడువు పొడిగింపు వారికి వర్తించదని స్పష్టం చేసింది.