- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నేను ఐపీఎల్ ఆడటం కష్టమే'
దిశ, స్పోర్ట్స్: కరోనా రెండో అల కారణంగా ఐపీఎల్ 2021లో కేవలం 29 మ్యాచ్‌లే జరిగిన విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. కాగా, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఇంగ్లాండ్ జట్టు బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటనలకు వెళ్లనున్నది. ఇంగ్లాండ్ జట్టుతో పాటు పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో తాను ఐపీఎల్ ఆడటం కష్టమేనని జాస్ బట్లర్ వెల్లడించాడు.
రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న బట్లర్.. ఇంగ్లాండ్ జట్టులో కీలక సభ్యుడు. ‘తాను ఐపీఎల్ రెండో దశలో పాల్గొనటం కష్టమే. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకోవాలి. ఏప్రిల్-మే నెలల్లో మాకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండవు కాబట్టి.. ఆడేదీ ఆడక పోయేది నా సొంత నిర్ణయం. కానీ అంతర్జాతీయ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలి’ అని బట్లర్ పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు రొటేషన్ విధానాన్ని సరిగ్గా అమలు చేస్తే అందరు ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడటానికి వీలుంటుందని బట్లర్ చెప్పుకొచ్చాడు.