- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీకి వెళ్లింది నిజమే.. డ్రగ్స్ కేసుపై స్పందించిన కలహార్ రెడ్డి
దిశ, క్రైమ్ బ్యూరో : బెంగుళూరులో మూడేళ్ల క్రితం జరిగిన పార్టీకి వెళ్లింది నిజమే కానీ, డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపార వేత్త కలహార్ రెడ్డి తెలిపారు. పార్టీకి వెళ్లడం కారణంగా నా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి మాత్రమే నన్ను పిలిచినట్టు తెలిపారు. బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కలహార్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల క్రితం జరిగిన పార్టీకి నాకు వచ్చిన ఆహ్వానం మేరకు వెళ్లి వచ్చానని తెలిపారు. కానీ, ఆ పార్టీలో నేనెలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్నందున నా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి మాత్రమే నన్ను బెంగుళూరు పోలీసులు పిలిచినట్టు పేర్కొన్నారు. ఆ మేరకు నేను బెంగుళూరు పోలీసులకు స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చి వచ్చానన్నారు. ఈ పార్టీలో నాతో పాటు మొత్తం 300 మంది పాల్గొనగా.. అందులో ఎవరెరూ పాల్గొన్నారనే విషయం నాకు తెలియదన్నారు.
శంకర్ గౌడ్ ఐదేళ్ల నుంచి పరిచయం ఉందన్నారు. సందీప్ రెడ్డి తో ముఖ పరిచయం మాత్రమే ఉందన్నారు. బెంగుళూరు పోలీసులు పార్టీ గురించి మాత్రమే వివరాలు అడిగినట్టు తెలిపారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు చెప్పినట్టు తెలియజేశారు. డ్రగ్స్ కేసు విషయంలో మీడియాలో వస్తున్న వార్తలతో నాతో పాటు నా కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. నిజంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే రాసుకోవాలని సూచించారు. కానీ, అనసవరంగా నాపై తప్పుడు వార్తలు రాయోద్దని కోరారు. ఈ కేసుతో నాకెలాంటి సంబంధాలు లేవన్నారు. ఇదిలా ఉండగా, కలహార్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేవలం ఒక నిమిషం మాత్రమే ఉండి వెళ్లిపోవడం గమనార్హం.