నేను సేఫ్ .. 'రాహు' హీరోయిన్ క్లారిటీ

by Shyam |   ( Updated:2023-07-28 06:03:50.0  )
నేను సేఫ్ .. రాహు హీరోయిన్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ‘రాహు’ హీరోయిన్ కృతి గార్గ్ మిస్సింగ్‌పై మీడియాలో హల్ చల్ అయింది. డైరెక్టర్ సుబ్బు కృతి మిస్ అయిందంటూ హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కొందరు డైరెక్టర్ సందీప్ వంగా కాల్ చేసినట్లు కృతికి కాల్ చేసి ముంబై రమ్మన్నారని.. అప్పటి నుంచి తను కాంటాక్ట్‌లో లేకుండా పోయిందని తెలిపాడు. అయితే తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపింది కృతి. డైరెక్టర్ సుబ్బు చెప్పింది నిజమే కానీ.. నేను అది బూటకపు కాల్ అని గ్రహించి డైరెక్ట్ ఇంటికి వచ్చేశానని తెలిపింది. అయితే తన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో డైరెక్టర్ భయపడిపోయి… పోలీసులను ఆశ్రయించారని తెలిపింది. ఇప్పుడు నేను పూర్తిగా సేఫ్‌గా ఉన్నానని… తనపై ప్రేమ చూపించిన తెలుగు ఇండస్ట్రీకి, మీడియాకు థాంక్స్ చెప్పింది.

Advertisement

Next Story