‘యూట్యూబ్‌’ను ఫాలో అవుతున్న దొంగలు..

by  |
‘యూట్యూబ్‌’ను ఫాలో అవుతున్న దొంగలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతమున్న ఆధునిక టెక్నాలజీని అందరికంటే ముందు దొంగలే సద్వినియోగం చేసుకుంటున్నారు. దొంగతనం చేశాక ఎవ్వరికీ దొరకకుండా ఎలా ఉండాలనే దానిపై కూడా వారు అవగాహన పొందుతున్నారు. ఇదేలా సాధ్యమంటే ‘ఇంటర్నేట్’ ఉంటే చాలనే సమాధానం పోలీసుల నుంచే వస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన దొంగతనమే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు చెప్పిన సమాధానం వీరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఫహాద్ ఖాన్, షేక్ మొయినుద్దీన్, మహ్మద్ అజమ్, షేక్ అమీర్‌లు యూ ట్యూబ్‌లో చూసి లగ్జరీ వాహనాలు ఎలా దొంగతనం చేయాలో నేర్చుకున్నట్లు విచారణలో తేలింది. ఇలా బీదర్‌లో దొంగిలించిన బైకులను హైదరాబాద్‌లో.. ఇక్కడ దొంగిలించిన వాటిని వారి ప్రాంతంలో అమ్మేవారని చెప్పారు. కాగా, నిందితుల నుంచి రూ.25లక్షల విలువైన స్పోర్ట్స్ బైకులను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed