- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్.. నా భర్తను ఆఫీస్‌కు రమ్మనండి.. ఇక వర్క్ ఫ్రం హోం చాలు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడంతో పాటు అనేకమందిని పొట్టనపెట్టుకుంది. దీంతో మహమ్మారి విస్తృత వ్యాప్తిని తట్టుకోలేక అనేక దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్ విధించుకున్నాయి. దీంతో సర్వం నిలిచిపోయాయి. పార్కులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, స్కూళ్లు ఇలా అనేకం మూతపడటంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అంతేగాకుండా.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాఫ్ట్‌వేర్ సహా చాలా రంగాల్లో వర్క్ ఫ్రం హోం కల్పించారు. కొన్ని కంపెనీల్లో నేటికీ వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. అంతేగాకుండా.. మరికొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం అమలు చేసే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోన్న ఉద్యోగులకు ఊహించని స్థాయిలో భారీ షాక్ తగిలినట్టైంది. ఇళ్లల్లో ఆడవారికి పని మరింత పెరిగింది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి.
ఈ క్రమంలో తాజాగా దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ట్వీట్ చూస్తే.. ఆ నివేదికల్లో ఉన్నది వాస్తవమే అని అర్థం అవుతుంది. హర్ష్ గోయెంకా అనే ఓ మహిళ తన భర్త కంపెనీకి రాసిన లెటర్ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు.
https://twitter.com/hvgoenka/status/1435958125719293959?s=20
అయితే.. లేఖలో సదరు మహిళ ‘‘సార్ నేను మీ కంపెనీలో పని చేసే మనోజ్ అనే ఉద్యోగి భార్యను. ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా విన్నవించుకుంటుంది ఒక్కటే. నా భర్తకు ఆఫీస్‌కు వచ్చి పనిచేసే అవకాశం ఇవ్వండి. అతను ఇప్పటికే టీకా రెండు డోసులు వేసుకున్నాడు.. అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తాడు. దయచేసి అతడిని ఆఫీస్‌కు రమ్మనండి. మీరు ఇలానే మరి కొన్నాళ్లు నా భర్తకు వర్క్ ఫ్రం హోం ఇస్తే.. మా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే వర్క్ ఫ్రం హోం మొదలైన నాటి నుంచి నాకు పని భారం పెరిగింది. నా భర్త రోజుకు పదిసార్లు కాఫీ తాగుతాడు.. ఒక్క గదిలో కూర్చుని పని చేయడు. వేర్వురు గదుల్లో కూర్చుంటాడు. పైగా అక్కడంతా చెత్తా చెదారం పడేస్తాడు. ఇక రోజుకు ఎన్నిసార్లు తింటున్నాడో లెక్కేలేదు. వర్క్ కాల్స్ సమయంలో కునికిపాట్లు పడుతుంటాడు. ఇప్పటికే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి బాగోగులు చూడ్డానికే సమయం సరిపోవడం లేదు. వారికి తోడు ఇప్పుడు నా భర్త వచ్చి చేరాడు. ఇంతమందికి సేవ చేయడం నా వల్ల కాదు. దయచేసి పెద్ద మనసుతో నా ఇబ్బందిని అర్థం చేసుకుని.. నా భర్తను ఆఫీస్‌కు పిలిచి.. నాకు కొంత విశ్రాంతి ఇవ్వండి’’ అని కోరింది.
దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారందరూ ఉన్నపలగా షాక్‌కు గురయ్యారు. వాళ్ల వాళ్ల ఇంట్లో పరిస్థితి పరీక్షిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కంటిన్యూ చేసుకునేలా తెలుస్తోంది. అంతేగాకుండా.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.