భర్తను అమ్మాయిగా మార్చిన భార్య.. శోభనం రాత్రి అలా..

by vinod kumar |   ( Updated:2021-06-18 05:27:10.0  )
he becomes she after marriage
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తల బంధానికి అర్ధమే లేకుండా పోతుంది. భార్య తప్పు చేసిందని భర్త, భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య గొడవ పడుతూ విడాకుల కోసం కోర్టుమెట్లుక్కుతున్నారు. ఇక మరికొందరు భర్త మగాడు కాదని, తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని భర్త పరువు రోడ్డున పెడుతున్నారు. కానీ, తన భర్త పురుషుడు కాదని తెలిసినా ఓ భార్య అంగీకరించింది. భర్తకు కూడా తనలాగే మారాలని ఉందని తెలుసుకున్న ఓ భార్య, భర్తను అమ్మాయిగా మార్చింది. దగ్గరుండి భర్తకు లింగ మార్పిడి చేయించి మళ్లీ తనను పెళ్లాడింది. ఈ ఘటన బ్రిటన్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాక్ కి ఫేస్ బుక్ లో అమెరికాకి చెందిన హెర్బీ అనే యువతి పరిచయమైంది. 2006 లో మొదలైన వీరి పరిచయం 2010 లో ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు దారితీసింది. ప్రేమించిన వాడితో పెళ్లి జరిగిసేసరికి ఉబ్బితబ్బుబ్బిపోయిన హెర్బీ తమ హనీమూన్ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసింది. ఒక దీవిలో వారి హానీమూన్ గ్రాండ్ గా ఏర్పాటు చేసింది. శోభనం గదిలో జాక్ తన భావాలను హెర్బీ తో పంచుకున్నాడు. తాను మగాడిని కాదని, తనకు ఆడవారిలా డ్రెస్ వేసుకోవాలని ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా తాను లింగమార్పిడి చేయించుకోనున్నట్లు తెలిపాడు. దీంతో ఒక్కసారిగా ఖంగు తిన్న హెర్బీ వెంటనే తేరుకొని జాక్ కి సపోర్ట్ గా నిలిచింది. తన భర్త కోరిక తీర్చడానికి 45 వేల పౌండ్లు ఖర్చు చేసి జాక్ ని కాస్తా రిహన్న గా మార్చేసింది.

రిహన్న గా మారిన జాక్ హెర్బీ టోన్ కలిసిఉండాలని కోరుకుంటున్నానని తెలపడంతో మరోసారి రిహన్న, హెర్బిలు తమదైన స్టైల్ లో వివాహం చేసుకున్నారు. ఇక వీరి ప్రేమ కథ నెట్టింట్లో వైరల్ గా మారింది. నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంట అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story