- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్టింటికి వెళ్లిన భార్య నగ్న ఫొటోలతో భర్త.. ఛీఛీ.. ఏ మొగుడు ఇలా చేయడేమో..!
దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భార్యను కళ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన భర్త నీచానికి ఒడిగట్టాడు. భార్య తనను వదిలేసి వెళ్లిందన్న కోపంతో ఆమె నగ్న చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దారుణ ఘటన నోయిడా నగరంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. గురుగావ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళ(28) తో 2010 లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిలల్లు ఉన్నారు. అయితే గత కకొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో భార్యాభర్తలు ఇద్దరు నిత్యం గొడవపడుతుండేవారు. గొడవలో భర్త, భార్యపై చేయిచేసుకొని చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో భర్త వేధింపులను భరించలేని ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఇక తనను వదిలి వెళ్లిపోయిందనే కోపంతో భార్యపై కక్ష కట్టిన భర్త నీచానికి దిగజారాడు. ఫేస్ బుక్ లో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో భార్య నగ్న చిత్రాలను, అశ్లీల చిత్రాలను అవమానకరమైన శీర్షికలతో పోస్టులు చేయడం మొదలు పెట్టాడు. అది గమనించిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా భర్త బాగోతం బయటపడింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు భర్తపై ఐటీ, ఐపీసీ 377,498 ఎ, 506,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.