యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం… ఓ అద్బుతం

by Shyam |
HRC Chairman Chandraya
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం ఓ అద్భుతమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య కొనియాడారు. శిల్పకళా సంపదతో అలరారుతున్న కట్టడాల ద్వారా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని అభిప్రాయపడ్డారు. గురువారం యాద‌గిరిగుట్టను సంద‌ర్శించిన ఆయ‌న బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపైన నిర్మాణాలను వీక్షించారు. జస్టిస్ చంద్రయ్యతోపాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ ఛైర్మన్ జి.రాజేశం గౌడ్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో ప్రత్యేక స్వాగతం పలికిన అర్చకులు హెచ్చార్సీ, ఎస్ఎఫ్సీ చైర్మన్లకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం హరిత హోటల్లో సీఎం కేసీఆర్‌ను జస్టిస్ చంద్రయ్యతోపాటు రాష్ట్ర ఆర్థిక సంస్థ ఛైర్మన్ జి.రాజేశం గౌడ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Advertisement

Next Story