- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాండ్ శానిటైజర్ ఇంట్లో తయారుచేసుకోండిలా!
దిశ, వెబ్‌డెస్క్: నోవల్ కరోనా వైరస్ మాత్రమే కాదు, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. కోవిడ్ 19 లాంటి వైరస్ విజృంభన మొదలైనపుడే మళ్లీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలనే జ్ఞానం వస్తుంది. అయితే చేతులు సబ్బుతో కడుక్కోవడానికి వీలు కాని వారు హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తారు.
కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ విజృంభించడంతో మాస్కులతో పాటు హ్యాండ్ శానిటైజర్లు కూడా విపరీతంగా అమ్ముడుపోయాయి. దీంతో వాటి స్టాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్ కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ అని కనిపిస్తోంది. అయితే హ్యాండ్ శానిటైజర్ లేదు కదా అని ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయలేం కదా… అందుకే ఇంట్లోనే హ్యాండ్ శానిటైజర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
తయారీ విధానం
హ్యాండ్ శానిటైజర్ ఇంట్లో తయారుచేసుకోవడానికి కావాల్సినవి 99 శాతం ఐసోప్రొపైల్ కలిగి ఉన్న రబ్బింగ్ ఆల్కహాల్, కలబంద ఆకుల జెల్, వాటిని కలపడానికి ఒక గిన్నె. మూడింట రెండు వంతుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఒక వంతు కలబంద ఆకుల జెల్ మిశ్రమాన్ని గిన్నెలో పోసి, బాగా కలిపితే చాలు.. హ్యాండ్ శానిటైజర్ రెడీ. దీన్ని ఒక ట్యూబ్‌లో గానీ, డిస్పెన్సర్‌లో గానీ వేసి వాడుకోవచ్చు. ఒకవేళ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ లేకపోతే వోడ్కా కూడా కలుపుకోవచ్చు.
వాడటం ఎలా?
షాపులో కొన్న శానిటైజర్ల మాదిరిగా ఈ ఇంట్లో తయారు చేసిన శానిటైజర్‌ని ఉపయోగించకూడదు. చేతిలో రెండు చుక్కలు వేసుకుని రుద్దుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ ఇంట్లో చేసిన శానిటైజర్ ద్రావణంలో చేతులను ముంచి పూర్తిగా తడవనివ్వాలి. తర్వాత వాటిని ఆరే వరకు ఆగాలి. అప్పుడే శానిటైజర్ ఎక్కువ సమర్థంగా పనిచేస్తుంది. ఒకవేళ చేతులకు ఎక్కువ దుమ్ము గానీ, ధూళి గానీ ఉంటే ముందు కొద్దిగా నీళ్లతో శుభ్రం చేసి, ఆరిన తర్వాత శానిటైజర్ ఉపయోగించాలి. అలాగే మీ ఫోన్‌ని కూడా కొద్దిగా శానిటైజర్‌తో క్లీన్ చేయడం వల్ల 99 శాతం వైరస్‌లు దరిచేరకుండా ఉండొచ్చు.