Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. నువ్వు ఏమైనా బాలకృష్ణ ఫ్యానా? రైలుతో పోటిపడి పరిగెత్తడమేంటి?

by Vennela |
Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. నువ్వు ఏమైనా బాలకృష్ణ ఫ్యానా? రైలుతో పోటిపడి పరిగెత్తడమేంటి?
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: రీల్స్ పిచ్చి పీక్ స్టేజీకి వెళ్తోంది. రీల్స్ పిచ్చిలో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూశాం. వైరల్ అయ్యేందుకు ప్రాణాలే పణంగా పెడుతున్నవారు ఎందరో ఉన్నారు. ప్రమాదమని తెలిసి కూడా లెక్కచేయడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో..నెటిజన్లకు ఆగ్రహం తెప్పించేలా చేసింది. రీల్స్ అంటే సరదాగా ఉండాలి కానీ భయపెట్టేలా ఉండకూడదంటూ ఫైర్ అవుతున్నారు. ఓ అమ్మాయి రైలుతోపాటు పరుగెడుతున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. రైలుతో పరుగెత్తడం ఏంటీ.. నువ్వు ఏమైనా బాలక్రిష్ణ ఫ్యానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

రైల్వే ట్రాక్ దగ్గర రీల్స్ తయారు చేయడం కూడా చట్టపరంగా నేరం. రైల్వే ట్రాక్‌ల దగ్గర రీల్స్ చేయడం BNS సెక్షన్ 281 , సెక్షన్ 120 ప్రకారం నేరం. ఇలా చేయడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో భద్రతా ముప్పు కూడా ఏర్పడుతుంది. ఇలా చేసినవారికి 1 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా విధించే నిబంధన ఉంది. కానీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఓ అమ్మాయి ఇవేమీ పట్టించుకోలేదు. ఆమె వేగంగా దూసుకుపోతున్న రైలుకు పోటీ పడుతూ పరిగెత్తింది. ఆమె ఇలా చేయడం వెనుక ఉద్దేశ్యం ఏదైనా నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. కొంతమంది రైల్వే ట్రాక్ కు దగ్గర ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదంటూ సలహా ఇస్తున్నారు. ఆ అమ్మాయి రైలుతో పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ రైలుతో పోటీ పడలేకపోయింది. రైలు వేగం తెలిసిందే. పరుగెడుతున్న సమయంలో బ్యాలెన్స్ కొల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. రీల్ లైఫ్ లో ఇవన్నీ జరుగుతాయోమో కానీ రియల్ లైఫ్ లో ఏమాత్రం తేడా కొట్టినా జీవితాన్నే కోల్పోవల్సి వస్తుందని ఫైర్ అవుతున్నారు.

నోట్: ఎవరి మనోభావాలు తిన్నా మాకు సంబంధం లేదు.





Next Story

Most Viewed