- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడో మనిషి.. దాపరికం దేనికి?
దిశ, ఫీచర్స్ : సొసైటీలో మనుషులను గౌరవప్రదంగా గుర్తించేందుకు అనేక పారామీటర్స్ ఉంటాయి. మనీ, స్టేటస్, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు ఒక్కోసారి రంగు, రూపం, లైంగికత అంశం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రజెంట్ జనరేషన్‌లో టాలెంట్ ఉంటే చాలు.. వరల్డ్ వైడ్ పాపులారిటీ కూడా సాధ్యమే అని ఎంతో మంది ప్రూవ్ చేస్తున్నారు. కానీ ఈ టెక్నాలజీ ఎరాలో కూడా మనుషుల మస్తిష్కాల నుంచి పూర్తిస్థాయిలో తొలగిపోని ఓ భావన మాత్రం కొందరిని స్వేచ్ఛగా బతకనివ్వడం లేదు. అదే ఎల్‌జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్)పై చిన్నచూపు.
సుప్రీం కోర్టు థర్డ్ జెండర్స్‌కు చట్టబద్ధత కల్పించినా సరే.. తమ జెండర్ గురించి సొసైటీలో ధైర్యంగా చెప్పుకుని తిరిగేంత స్వేచ్ఛ వారికి దొరకడం లేదు. సొసైటీ వైఖరే అందుకు కారణం కాగా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫేమస్ పర్సనాలిటీస్.. అది కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తమ జెండర్ క్వాలిటీస్‌ను ధైర్యంగా చెప్పుకోవడం విశేషం. కానీ ఆ తర్వాత వారు నార్మల్ లైఫ్‌ను లీడ్ చేయగలుగుతున్నారా? ఈ అసమానతలు తొలగిపోవడానికి తమ వంతుగా ప్రయత్నిస్తున్నారా? ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్‌లు ‘గే సెక్స్’ను ఏవిధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి? సొసైటీని ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయి?
‘గే’ అనే పదం వింటేనే చిరాకుగా, చిన్నతనంగా చూసే పరిస్థితుల నుంచి సొసైటీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వీరి లక్షణాల గురించి అవహేళన చేయకుండా గౌరవిస్తున్నారు. గతంలో థర్డ్ జెండర్స్ ఎవరైనా తమ ‘గే’ లక్షణాలను కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకునేందుకు భయపడేవారు. ఒకవేళ చెప్పినా సొసైటీ ఆమోదించదని, నలుగురిలో నవ్వుల పాలు కావలసి వస్తుందనే తల్లిదండ్రుల భయం కూడా వారిని వెలివేసేది. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని విడిచి, సెపరేట్‌గా ‘గే’ కమ్యూనిటీలోనే బతికేవారు. ఈ క్రమంలో చదువుతో పాటు ఉపాధికి దూరమై.. భిక్షాటన లేదంటే సెక్స్ వర్కర్లుగానే బతకాల్సి వచ్చేది. పేద కుటుంబాల్లో ఈ తరహా సమస్యలుంటే, రిచ్ ఫ్యామిలీస్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండేది. సొసైటీకి భయపడి పెళ్లి చేసుకునే వరకు ఆ విషయాన్ని దాచిపెట్టినా, నిజం తెలిసిన తర్వాత అక్రమ సంబంధాలు, ఆత్మహత్యలకు దారితీసిన సంఘటనలూ అనేకం.
ఓపెన్‌గా ప్రకటించిన బాలీవుడ్ సెలబ్రిటీస్
క్రమంగా పరిస్థితి మారుతోంది. సుప్రీం కోర్టు సైతం థర్డ్ జెండర్స్‌కు చట్టబద్ధత కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కార్పొరేట్ స్థాయి జాబ్‌ల వరకు థర్డ్ జెండర్స్ రాణిస్తున్నారు. వీరి కథలు, పాత్రలతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా నిర్మితమవుతున్నాయి. హోమో సెక్సువల్స్, బైసెక్సువల్స్‌కు సంబంధించిన సెక్స్ లైఫ్‌ను చూపించేందుకు ఫిల్మ్ మేకర్స్ వెనుకాడటం లేదు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కరణ్ జోహార్, ఓనిర్, డిజైనర్స్ మనీష్ మల్హోత్రా, రోహిత్ వర్మ, రోహిత్ బల్, పాపులర్ రైటర్ విక్రమ్ సేథ్, ఫ్యాషన్ స్టైలిస్ట్ ఇమామ్ సిద్ధిఖీ, టీవీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ వికాస్ గుప్తా, మోడల్ సుశాంత్ దివికర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు తమ ఎల్‌జీబీటీ లక్షణాల గురించి ఓపెన్‌గానే ప్రకటించారు. మొదట కొన్ని విమర్శలు ఎదురైనా, ఆ తర్వాత ఎవరి రంగాల్లో వారు కెరీర్‌ను లీడ్ చేస్తున్నారు. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోస్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తూ, థర్డ్ జెండర్స్‌లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో కూడా తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ పాల్గొంది. ఆ ఫేమ్‌తో తను పాలిటిక్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
వెబ్ సిరీస్‌లు, సినిమాలు/‘గే’, లెస్బియన్ పాత్రల్లో స్టార్స్
ఒకప్పుడు హీరోయిజాన్ని బేస్ చేసుకుని సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్స్.. ఇప్పుడు కథకు ప్రాధాన్యతనిస్తుండటం గొప్ప విషయం. ఈ క్రమంలోనే సమాజంలో నిరాదరణకు గురైన అనేక సమస్యలపై చిత్రాలు తెరకెక్కుతున్నాయి. గతంలో కామెడీ కోసం క్రియేట్ చేయబడ్డ ‘గే’ పాత్రలు.. ప్రస్తుతం కథావస్తువులుగా మారుతున్నాయి. లారెన్స్ హీరోగా వచ్చిన ‘కాంచన’ సినిమా ఈ కోవకు చెందిందే. అయితే ఇంతకుముందు సినిమాల్లో పలు ఇంటిమేషన్ సీన్లకు ‘సెన్సార్’ బోర్డు కత్తెర వేసేది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు ఆ అడ్డంకులేవీ లేకపోవడంతో.. ఇంతకాలం లైమ్ లైట్‌లోకి రాని ఎల్‌జీబీటీ సెక్స్ లైఫ్‌పై అనేక ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. ‘ఉస్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా, అ!, కపూర్ అండ్ సన్స్, ఫోర్ మోర్ షాట్స్, పావ కధైగల్, బ్రీత్ ఇన్ టు ద షాడోస్, బాంబే బేగమ్స్’ వంటి సినిమాలు, సిరీస్‌ల్లో లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ సెక్సువల్ లైఫ్‌తో పాటు వారి సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
అయితే ఈ ధోరణి తప్పా? ఒప్పా? అనే సంగతి పక్కనబెడితే.. మనసుకు నచ్చిన విధంగా బతకాలని చెప్పడమే వీటి లక్ష్యం. సమాజం కోసం మన భావాలను నియంత్రించుకోవాల్సిన అవసరం లేదని, ఈ సృష్టిలో అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని చాటిచెప్పడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈ తరహా పాత్రల్లో నటించేందుకు స్టార్లు కూడా వెనకాడటం లేదు. సోనమ్ కపూర్, నిత్యా మీనన్, ఇషా రెబ్బా, అభిషేక్ బచ్చన్, కాళీదాస్ జయరాం, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి బడా స్టార్లు తమ ఇమేజ్‌ను పక్కనబెట్టి మరీ ఇటువంటి క్యారెక్టర్లలో యాక్ట్ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య జనంలోనూ ఎల్‌జీబీటీ కమ్యూనిటీపై పాజిటివిటీ పెరుగుతోంది.
థర్డ్ జెండర్స్ పట్ల సొసైటీ తీరుతెన్నుల్లో, ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తున్నా.. వారు అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నా.. సెలబ్రిటీస్ సైతం తమ గే లక్షణాలను బహిరంగంగానే ప్రకటించుకుంటున్నా.. ఇంకా చాలామంది తమ జెండర్ ఐడెంటిటీని బయటపెట్టలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ‘సోషల్ యాక్సెప్టెన్స్ కంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్’ ముఖ్యం అన్న వాదనలూ వినబడుతున్నాయి.