- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ మార్కెట్ల మనుగడెట్టా..?
దిశ ప్రతినిధి, నల్లగొండ: కేంద్ర వ్యవసాయ చట్టాలా పుణ్యమానని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేసింది. పైగా ధాన్యం పూర్తిస్థాయి కొనుగోళ్లను వ్యవసాయ మార్కెట్ నిర్వహిస్తుందని ప్రకటించారు. వాస్తవానికి వ్యవసాయ మార్కెట్ కమిటీలన్నీ నిర్వీర్యం అయ్యాయి. నిర్వహణ భారమే గగనంగా మారింది. రాజకీయ నిరుద్యోగుల కోసమే వ్యవసాయ మార్కెట్ కమిటీలన్నట్టు ఇన్నీ రోజులు ప్రభుత్వం వాటిని కొనసాగిస్తూ వచ్చింది. కానీ సడెన్‌గా ధాన్యం కొనుగోలు భారాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలపై మోపుతోంది. అసలే నిధుల్లేక ముక్కుతూ ములుగుతూ మార్కెట్ యార్డుల నిర్వహణను నెట్టుకొస్తున్న పాలకవర్గాలకు ఇది తలకు మించిన భారంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ధాన్యం కొనుగోలు అంశం సఫలం అవుతుందా.. లేక గతంలో లాగా ధాన్యం అమ్మకాల కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందా.. అన్నది వేచిచూడాల్సిందే. ఇదిలావుంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 21 వ్యవసాయ మార్కెట్ యార్డులు, 15 సబ్ మా ర్కెట్ యార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇందులో వ్యవసాయ మార్కెట్లు కేవలం 40 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశాయి. అంటే ఇంకా 5.6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సిబ్బంది కొరత, నిర్వహణ తీరుపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. ఇవీగాక మరో 12 సబ్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. యాసంగి సీజనుకు సంబంధించి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇందులో మార్కెట్ యార్డుల్లో కేవలం 30 వేల మెట్రిక్ టన్నుల లోపు ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇదిలావుంటే.. నల్లగొండ జిల్లా మార్కెట్ యార్డుల్లో మొత్తం 156 మంది రెగ్యులర్ సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం మార్కెట్ యార్డుల్లో 46 మంది మాత్రమే ఉండడం గమనార్హం. జిల్లాలోని మార్కెట్లలో రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కలిపి 171 మంది పని చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారం.. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తే.. 300 మంది అవసరం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. జిల్లాలో సగం మంది సిబ్బంది లేకపోవడం గమనార్హం. మార్కెట్ యార్డుల్లో గత వానాకాలం దిగుబడి ప్రకారం చూస్తే.. 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ మార్కెట్లలో 30వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ లెక్కన ప్రస్తుతం మార్కెట్లు కొనుగోలు చేసిన ధాన్యానికి 8 రెట్లు అధికంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 వ్యవసాయ మార్కెట్లు ఉండగా, మరో 3 సబ్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. అయితే గత వానాకాలం సీజనులో జిల్లావ్యాప్తంగా 1,93,958 మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇందులో మార్కెట్ యా ర్డుల్లో కేవలం 3,632 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చే శారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వాస్తవానికి 57 మంది సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం 17 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా పరిధిలోని పూర్తి స్థాయి ధా న్యం కొనుగోలు చేయాలంటే. .100 మంది దాకా అవసరం పడుతుంది. జిల్లా పరిధిలో 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కేంద్రాల్లో కొనుగోలు చేశా రు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో మార్కెట్ కమిటీలు ఆ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలంటే.. ఆ కమిటీలు ఎంత సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో మొత్తం 6 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. అయితే సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వానాకాలం సీజనుకు సంబంధించి 1.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొ నుగోలు చేశారు. మార్కెట్ యార్డుల విషయానికొస్తే.. కేవలం 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొను గోలు చేశారు. మిగతా 1.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు, రైసు మిల్లులు కొను గోలు చేశాయి. ఇదిలావుంటే.. జిల్లాలోని 6 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 137 మంది రెగ్యులర్ సిబ్బంది ఉం డాలి. కానీ ప్రస్తుతం కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. జిల్లాలో దిగుబడి వచ్చిన పూర్తి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తే.. 200 మందికి పైగా అవసరం పడుతుంది. ఇదిలావుంటే.. జిల్లాలో దిగుబడి వచ్చిన మొత్తం వరి ధాన్యంలో కేవలం 5 శాతం మాత్రమే మార్కెట్ కమిటీలు కొనుగోళ్లు చేపట్టాయి. మిగిలిన 95 శాతానికి పైగా ధాన్యం నిల్వలను ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు, రైసు మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లు చేపట్టడం గమనార్హం.