జూలై-సెప్టెంబర్ మధ్య రెండు రెట్లకు పైగా పెరిగిన ఇళ్ల అమ్మకాలు!

by Harish |
Housing sales
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రియల్టీ రంగం కరోనా మహమ్మారి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో మొత్తం 32,358 ఇళ్లు విక్రయించబడ్డాయని ఓ నివేదిక వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, డిమాండ్ పెరుగుదలే దీనికి కారణమని తెలిపింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తాజాగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఇళ్ల అమ్మకాల వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లోని విక్రయాలు రెండు రెట్లకు పైగా పెరిగాయని తన నివేదికలో పేర్కోంది.

నగరాల వారీగా చూస్తే.. సమీక్షించిన త్రైమాసికానికి హైదరాబాద్‌లో రెండింతలకు పైగా ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. గతేడాది మొత్తం 2,122 ఇళ్లు విక్రయించబడ్డాయని, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య 4,418 యూనిట్ల విక్రయించబడినట్టు నివేదిక పేర్కొంది. బెంగళూరులో మొత్తం 5,100 ఇళ్లు అమ్ముడవగా, గతేడాది ఇదే సమయంలో 1,742 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఇక, చెన్నైలో గతేడాది జూలై-సెప్టెంబర్ మధ్య 1,570 యూనిట్లు అమ్ముడైతే, ఈసారి 1,500కు పడిపోయాయి. ప్రధాన 7 నగరాల్లో చెన్నైలో మాత్రమే అమ్మకాలు డీలాపడ్డాయి. ఢిలీల్లో ఈ త్రైమాసికంలో మొత్తం 4,418 ఇళ్లు అమ్ముడయ్యాయి. ముంబైలో 6,7561,974 ఇళ్లు, కోల్‌కతాలో ఐదు రెట్లు పెరిగి 1,974 ఇళ్లు, పూణెలో నాలుగు రెట్ల వృద్ధితో 5,921 యూనిట్ల అమ్మకాలు జరిగాయని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. ప్రస్తుత ఏడాది మొత్తానికి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా మొత్త 77,576 ఇళ్లు అమ్ముడైనట్టు నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed