మిస్టరీగా హాస్టల్ గది నంబర్ 100

by Sumithra |
Suleiman Hostel
X

దిశ, వెబ్‌డెస్క్ : అది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్. హాస్టల్‌లోని 100 నంబర్ గదిలో ఆ వర్సిటీకి సంబంధం లేని లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. అతడు అక్కడికి ఎందుకు వచ్చాడు..? ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు..? అతడిని ప్రేరేపించింది ఎవరు..? అనే దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్ గదిలో చేసుకున్న ఆత్మహత్య ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఫిలిబిత్‌ పట్టణానికి చెందిన 24 ఏళ్ల అభిషేక్ కుమార్ సక్సేనా.. అలీగఢ్ ఏఎన్సీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. కాలేజీకి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న ఆయన.. వారం రోజుల క్రితం దానిని ఖాళీ చేసి వచ్చి యూనివర్సిటీ హాస్టల్‌లోకి మకాం మర్చాడు.

అయితే రాత్రి వరకు బాగానే ఉన్న సక్సేనా తెల్లవారే సరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు ఆయన ఆగ్రాకు చెందిన మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఆ తర్వాతనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఆగ్రాకు చెందిన మహిళ తన సోదరుడిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని, ఆమె వేధింపులు, ఒత్తిడి కారణంగా సక్సేనా ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సివిల్ లైన్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. అయితే అభిషేక్ సక్సేనాకు యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేనప్పుడు సులేమాన్ హాస్టల్‌లోని 100వ నెంబరు గదిలో ఎందుకు నివసిస్తున్నాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story