స్పీకర్ ‘పోచారం’ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆయన కోలుకున్నారట..!

by Shyam |
స్పీకర్ ‘పోచారం’ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆయన కోలుకున్నారట..!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభిమానులకు, టీఆర్ఎస్ శ్రేణులకు వైద్యులు శుభవార్త చెప్పారు. ఆయనకు కొవిడ్ వ్యాధి తగ్గిపోయిందని తెలపడంతో పాటు
శనివారం డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. దీంతో ఆస్పత్రి నుంచి పోచారం ఇంటికి చేరుకున్నారు. ఆయన మరి కొన్ని రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల 24న ఆయనకు కొవిడ్ లక్షణాలు కనిపించడగా.. టెస్టుల అనంతరం కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆయన ఇన్ని రోజులు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో డిశ్చార్జి చేసినట్టు డాక్టర్లు తెలిపారు.

Advertisement

Next Story