Horoscope Today, November 01, 2023: ఈ రోజు రాశి ఫలాలు

by Prasanna |   ( Updated:2023-11-01 03:47:25.0  )
Horoscope Today, November  01, 2023: ఈ రోజు రాశి ఫలాలు
X

మేష రాశి : ఈ రాశి వారికి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకండి. మీ స్నేహితుల దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు. మీ ప్రతికూల ప్రవర్తన మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను బాధిస్తుంది. మీ జీవిత భాగస్వామితో గొడవలకు వెళ్ళకండి.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు స్నేహితుల సహాయంతో పెండింగులో ఉన్న డబ్బును పొందొచ్చు. ఇది మీ మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు విద్యార్థులకు పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మిథున రాశి: ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీరు అనుకున్న పనులు సమయానికి జరగవు. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి. ఈరోజు చేసే ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో పూర్తి ప్రయోజనాలు పొందుతారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. మధ్యాహ్నం తర్వాత మీ స్వభావంలో మార్పు వస్తుంది. మీరు అనుకున్న పనులను చేయలేరు. మరోవైపు మీ ఇంట్లో కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మానసికంగా చాలా బాధ పడతారు. తెలియని విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి. లేదంటే భవిష్యత్తులో మీకు నష్టాలు తప్పవు. ఆర్థిక పరమైన ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు. మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి.

కన్యా రాశి: ఈ రాశి వారు ఏదైనా వివాదాస్పద పరిస్థితి ఉంటే, దానిని నివారించడానికి ప్రయత్నించాలి. లేదంటే మీరు పై అధికారులతో మాటలు పడాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు నిరాశ చెందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలొస్తాయి. మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలి. లేదంటే కొన్ని విషయాల్లో మీకు కోపం రావొచ్చు. మీరు చాలా కాలంగా మీ స్నేహితుడిని కలవాలని కోరుకుంటే, ఈరోజు తనని కలవవచ్చు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు కొన్ని పెద్ద విజయాలను పొందుతారు. మీరు న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించడంతో మీ ఆనందానికి అవధులు ఉండవు. మీ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. మీరు భావోద్వేగ విషయాల్లో తొందరపడకూడదు, లేదంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈ రోజు ఏదైనా కొత్త వ్యాపారంలో ఎక్కడైనా డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, మంచి లాభం రావొచ్చు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తే, దానిలో కూడా మంచి లాభాలను పొందొచ్చు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉండనుంది. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీకు ప్రభుత్వ పనులకు సంబంధించి పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. మీ అవసరం లేని చోట ఎక్కువగా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఆరోగ్య పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఆ తర్వాత సమయం ఉదాసీనంగా ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణంలో అశాంతిగా ఉంటుంది.

మీన రాశి: ఈ రాశి వారిలో ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉపాధి రంగంలో పని చేసే వారు మంచి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు, మీరు మీ కుటుంబంలోని ఎవరితోనైనా వివాదాన్ని కలిగి ఉంటే, అది కూడా ఈరోజుతో ముగుస్తుంది. ఈ రోజు మీ జీవిత స్వామితో సంతోషంగా గడుపుతారు.

Advertisement

Next Story