Horoscope Today, October 21, 2023: ఈ రోజు రాశి ఫలాలు

by Prasanna |   ( Updated:2023-10-21 02:19:08.0  )
Horoscope Today, October 21, 2023: ఈ రోజు రాశి ఫలాలు
X

మేష రాశి : మీరు చాలాకాలంగా ఎదురుచూస్తున్న విలువైన వస్తువుని ఈ రోజు మీరు పొందుతారు. అది మీ కీర్తిని పెంచుతుంది. అయితే, ఈ రోజు మీరు మీ మాటలు కంట్రోల్ చేసుకోవాలి. గొడవలో కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సాయంత్రం వరకూ మీ కుటుంబ సభ్యులతో మాటల్లో గడుపుతారు.

వృషభ రాశి: ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులతో విమర్శలను పట్టించుకోకుండా ఉండాలి. ఈ సాయంత్రం అతిథుల రాక వల్ల మీరు డబ్బు ఖర్చు చేస్తారు. ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇది చేస్తారు. మీ డబ్బు వ్యాపారంలో ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే ఈ రోజు అది తిరిగివచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ సౌకర్యాల కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు.

మిథున రాశి: ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి స్పృహతో ఉండాలి. ఎందుకంటే ఏదైనా సమస్యతో పోరాడితే అది ఈ రోజు అంతమవుతుంది. కొంత మంది ఇచ్చే సలహాలు తీసుకోండి. అధికారుల నుంచి ప్రమోషన్ పొందుతారు. సాయంత్రానికి మీ సంపద కూడా పెరుగుతుంది. ఈ రోజు మీరు అందరి నుంచి సపోర్ట్ తీసుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రోజు మీరు చాలా కష్టపడి పని చేయాల్సిన రోజు. ఈ రోజు మీరు మీ తల్లిండ్రులు, బంధువుల ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఈ రోజు మీరు మీ బిజినెస్ పనుల గురించి ఆందోళన ఉంటుంది. దీని కోసం మీరు మీ సోదరుల సలహా తీసుకోవచ్చు.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు నమ్మకంతో ఏదైనా పని చేస్తే, దాని వల్ల మీరు కచ్చితంగా అపారమైన ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు మీరు మీ ఉద్యోగంలో సహోద్యోగులతో కలిసి పని చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో మీ జీవిత భాగస్వామి యొక్క పురోగతిని చూసి సంతోషిస్తారు.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేస్తే, వారు మీ ఒప్పందాన్ని నిలిపివేయొచ్చు. దీంతో మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి. మీరు పెట్టిన డబ్బులకు మంచి లాభాలు వస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దాని వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు మీరు మీ వ్యక్తిగత ప్రదర్శన కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయొద్దు. ఎందుకంటే దీని వల్ల మీ శత్రువులు తట్టుకోలేరు. ఈ రోజు మీరు మీ తెలివి తేటలు, విచక్షణని ఉపయోగించి వ్యాపారంలో కొన్ని కొత్త పనులు చేయడం ప్రారంభిస్తారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు పాత వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. మరోవైపు ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు సమాజంలో మంచి గౌరవ, మర్యాదలను పెంచుకుంటారు. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ వస్తుంది. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. మీరు మీ డబ్బును ప్రస్తుతం ఉన్న చోటే ఉంచాలి.పెట్టుబడులు పెట్టె టప్పుడు ఒకటికి, రెండు సార్లు ఆలోచించాలి.

కుంభ రాశి: ఈ రోజు మీరు అన్ని పనులు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే, చాలా సమస్యలొస్తాయి. వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఈ రోజు బిజినెస్‌లో కూడా మీ శత్రువులు మీకు నష్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ఏదైనా బిజినెస్ అగ్రీమెంట్ చేసుకుంటే తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తగా ఉండండి.

మీన రాశి: ఈ రోజు సామాజిక, రాజకీయ పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. దానిని మీరు సద్వినియోగం చేసుకుంటారు. బిజినెస్ చేసే వారికి వారి బిజినెస్‌లో కొన్ని మార్పులు ఉంటాయి. దాని వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి సపోర్ట్ దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే ఫ్యూచర్‌లో నెగెటీవ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు

Advertisement

Next Story

Most Viewed