- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు
మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు తాము చేసే పనిలో కష్టపడి విజయం సాధిస్తారు. మీ కోసం మీరు సమయాన్ని కేటాయించండి. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోవాలి. మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. కానీ ప్రతిది మీకు నచ్చి నట్టు జరగదు.మీ చుట్టాలందరికి దూరంగా ఉంటారు. ఈరోజు ప్రశాంతవంతమైన ప్రదేశానికి వెళతారు. మీ వైవాహిక జీవితంలో కెల్లా గొప్ప రోజుల్లో ఒకటిగా అవ్వనుంది.
వృషభ రాశి: మీరు అన్ని పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీ మనస్సు మీ ఆధీనంలో ఉంచుకోండి.ఈ రోజు శుభకార్యాలకు డబ్బులు ఖర్చు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి
మిథున రాశి: ఆధ్యాత్మిక ప్రయాణాలు వాయిదా వేసుకోవచ్చు. మీరు పని చేసే ఆఫీసులో మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల మీకు ప్రశాంతత ఉండదు. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది. ఇవాళ మీ కోసం ఇచ్చే బహుమతులతో పాటు కొంతసమీ కోసం మీ జీవిత భాగస్వామి ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ మీ ఈ రోజు ప్రారంభం కలిసిరాదు.. కానీ సాయంత్ర సమయానికి మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఆర్ధిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారికీ మీ ప్రేమను పంచండి. ఈ రోజు మీరు కొన్ని అశుభవార్తలు వినాలిసి ఉంటుంది. . ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచం జాగ్రత్త అవసరం. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి : అతిగా ఖర్చులు పెట్టకండి. మీకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు అది గుర్తు పెట్టుకోండి. మీరు, మీ సమయాన్ని మీ ఇంట్లో వారికీ కేటాయించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక స్పెషల్ చేస్తారు. మీ యొక్క పనులు పూర్తికాకూండా మీరు కొత్త పనుల గురించి ఆలోచించకండి . ఇది మీరు పాటించకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి.
కన్యా రాశి: ఏ పని అయినా కష్టపడి పని చేయాలి. అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు.. మీ ఇంటికి అతిదులు రావడం వలన మీ పనులను వాయిదా పడతాయి. ఈ రోజు పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొంత సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. మీ పనులను సకాలంలో పూర్తి చేయాలి.. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది.
తులా రాశి: మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త అవకాశాలను పొందుతారు. మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలొస్తాయి. ఈ రోజు మీ ప్రేమ మీకు ఒక విలువైన వస్తువుగా మారనుంది. దీని వల్ల సంతోష పడతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
వృశ్చిక రాశి: మీ పాత స్నేహితులను కలుసుకొని వారి నుంచి కొంత డబ్బునుఅప్పుగా తీసుకుంటారు. మానసికంగా మీరు పడుతున్న బాధలు తగ్గుతాయి. పని ఒత్తిడిని తగ్గించడానికి రోజు మీరు యోగా, వ్యాయామం చేయాలిసి ఉంటుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు అందమైన బహుమతిని ఇస్తారు.
ధనస్సు రాశి : ఈ రోజు మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు కొంత నష్టాన్ని చవిచూడొచ్చు. మీ కుటుంబంలో చిన్న పిల్లలతో సరదాగా గడపండి. దీని వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నేడు మీ ప్రేమ వల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఈ రోజు మీరు కొన్ని పనులను చేయలేకపోతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి: ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ ప్రేమ మీకు ఒక విలువైన వస్తువుగా మారనుంది. దీని వల్ల సంతోష పడతారు. మీరు పని చేసే ఆఫీసులో మీకు నచ్చని పనులు జరుగుతాయి. అది చూసి మీకు చాలా కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
కుంభ రాశి: స్నేహితులతో మాట్లాడటం వల్ల ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు ఒత్తిడి కూడా తగ్గుతుంది. మీ పాత స్నేహితులను ఈ రోజు కలుసుకుంటారు. వారితో సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
మీన రాశి: ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలొస్తాయి. సీనియర్ వ్యక్తులు ఈరోజు మీకు ప్రయోజనం చేకూరుస్తారు. మీ కుటుంబ సభ్యులతో మీ సమస్యల గురించి చర్చిస్తారు. మీరు చేసిన పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవిత భాగస్వామిని మంచిగా చూసుకోండి.
ఇవి కూడా చదవండి : August 31: ఆకాశాన్నింటిన బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగిన రేట్లు