zodiac signs : సూర్యుడి సంచారం : ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

by Jakkula Samataha |
zodiac signs : సూర్యుడి సంచారం : ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
X

దిశ, ఫీచర్స్ : సూర్యుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటూ వస్తాడు. కాగా, ప్రస్తుతం సూర్యభగవానుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూలై 14 నుంచి ఆయన పుష్య నక్షత్రం లో సంచరిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మరిన్ని రాశుల వారికి సమస్యలు ఎదురు అవుతాయి. కాగా, సూర్యుడు రాశి మార్చుకోవడం వల్ల ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి : సూర్యుడు రాశి మార్చుకోవడం వలన కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. చేపట్టిన ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మిథున రాశి : ఈ రాశి వారికి జూలై 14 నుంచి అదృష్టం వరించింది. ఉద్యోగస్థులకు మంచి పేరు రావడమే కాకుండా ఆర్థికంగా బాగుంటుంది. రుణ బాధల నుంచి బయటపడతారు. మీరు కోరుకునే కోరికలన్నీ నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి : సూర్యుడు పుష్య నక్షత్రం లోకి ప్రవేశించడం వలన వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. విద్యార్థులకు,వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వస్తుంది.

( నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story