- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sukrudu: శుక్రుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు, రాశి సంచారాలు చేస్తుంటాయి. అన్ని రాశులవారికి మంచి ఫలితాలను ఇచ్చే గ్రహాల్లో శుక్ర గ్రహం కూడా ఒకటి.. ఈ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా, ఈ శుక్ర గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ గ్రహం అప్పుడప్పుడు సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితం మారిపోనుంది. అలాగే, శుక్రుడికి (Sukrudu ) ఇష్టమైన రాశులు ఉన్నాయన్న విషయం మనలో చాలా మందికి తెలీదు. ఈ రాశుల వారిపై ఎల్లప్పుడూ లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. ఈ రాశుల వారి సంపాదనలో మార్పులు రావడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే, అనారోగ్య సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మీన రాశి ( Meena rashi )
శుక్రుడి మీన రాశి కూడా ఎంతో ఇష్టంగా జ్యోతిష్య శాస్త్రంలో భావిస్తారు. వ్యాపారాల్లో అనేక లాభాలు పొందనున్నారు. దీంతో కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ రాశివారు మొదటి పెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే విద్యా రంగంలో కూడా పురోగతి లభిస్తుంది.
వృషభ రాశి ( Vrushabha rasi )
శుక్రుడికి చాలా ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి. అలాగే సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తగ్గుతాయి. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారికీ ఊహించలేని డబ్బు వస్తుంది. అంతేకాకుండా, ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.