Sun Transit : సింహరాశిలోకి సూర్యుడు.. ఆ రాశుల వారికి గుడ్ డేస్ ప్రారంభం.. మీ రాశి ఉందా?

by Prasanna |
Sun Transit : సింహరాశిలోకి సూర్యుడు.. ఆ రాశుల వారికి గుడ్ డేస్ ప్రారంభం.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. సింహరాశిలో బుధ గ్రహంతో పాటు శుక్ర గ్రహం ప్రవేశించబోతుంది. ఇదే సమయంలో సూర్యుడు కూడా సంచారం చేయడంతో మూడు గ్రహాలు కలవనున్నాయి. దీని వలన శుక్రాధిత్య రాజయోగం ఏర్పడునుంది. రెండు రోజుల తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే, 12 రాశుల్లో రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేష రాశి

ఈ రెండు రాజయోగాల వల్ల మేష రాశి వారు లాభాలను పొందుతారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ కారణంగా, వారు ఎలాంటి సమస్యలు రాకుండా విజయం సాధిస్తారు. కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు అధికంగా వస్తాయి. దీని వలన మీ ఇంట్లో వారు సంతోషంగా ఉంటారు. మీరు ఎప్పటికి కలవలేరు అనుకున్నవారిని కలుస్తారు. అప్పుడు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.

మిథున రాశి

మిథునరాశి వారికి సూర్యుని గమనం చాలా మేలు చేస్తుంది. ఇంకా, వారి ద్వారా ఏర్పడిన రాజయోగం కూడా అనుకూలమైన స్థితిలో ఉంటుంది. అందువల్ల, వారు కోరుకున్న పెద్ద పనులలో కూడా విజయం సాధిస్తారు. సూర్యుని సంచారం వలన అనుకూలమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అదనంగా, మీరు మీ జీవిత లక్ష్యాలను సాధించగలుగుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story