Shani Transit: శని సంచారం ఆ రాశుల వారికి గోల్డెన్ టైం స్టార్ట్..!

by Kavitha |
Shani Transit: శని సంచారం ఆ రాశుల వారికి గోల్డెన్ టైం స్టార్ట్..!
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రంలో రాశులు, గ్రహాలు ప్రత్యేకమైనవి ఇవి ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ప్రస్తుతం శని దేవుడు, కుంభ రాశిలో ప్రయాణిస్తున్నాడు. మరో నెలలో శని మళ్లీ తిరోగమనం నుంచి యథాతథ స్థితికి రానున్నాడు. దీని ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. వాటిలో రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

సింహ రాశి

ఈ రాశి వారు పెండింగ్ పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టిన వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఈ రాశికి చెందిన అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఖాళీ సమయాన్ని టీవీ కానీ టెలిఫోన్ ముందు గడుపుతారు. మీరు చేసే పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది.

ధనస్సు రాశి

మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం వస్తుంది. విలువైన వస్తువులను మీకు ఇష్టమైన వారికి బహుమతులుగా ఇస్తారు. ఉద్యోగం లేని వారికి మంచి జాబ్ వస్తుంది. దీని వలన మీ ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed